APPLE AGRICET PROGRAM

ఆపిల్ అగ్రిసెట్ ప్రోగ్రాం – 2021

ప్రతిభావంతులైన పేద విద్యార్ధుల కోసం విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం “ఆపిల్ అగ్రిసెట్ ప్రోగ్రాం” . ఈ కార్యక్రమం లో ప్రతి సంవత్సరం అనేక మంది పేద విద్యార్ధులు లబ్ది పొందుతున్నారు. వ్యవసాయ డిప్లొమా కోర్సులు చదివించే అనేక మంది తల్లి దండ్రులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు మరియు పేదవారు… వీరిని  దృష్టిలో పెట్టుకొని మన అకాడమీ “ఆపిల్ అగ్రిసెట్ ప్రోగ్రాం” ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది.

ఆపిల్ అగ్రిసెట్ ప్రోగ్రాం 2021 లో చేరడానికి ఆన్ లైన్ లో ఒక  ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాం. ఈ పరీక్షలో ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్దులకు ఎటువంటి ట్యూషన్ ఫీజు లేకుండా ఉచితం గా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే విద్యార్ధుల ఎంపిక లో పూర్తి హక్కులు అకాడమీ వారివే.. దీనిలో ఎటువంటి వివాదాలకు తావులేదు…

ఆపిల్ అగ్రిసెట్ 2021 ప్రవేశ పరీక్ష జనవరి 24 , 2021 ఆదివారం ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో నిర్వహించ బడుతుంది. ఈ ఆన్ లైన్ పరీక్ష కు సంబంధించిన లింక్ మన వెబ్ సైట్ లో ఉంచబడుతుంది. ఈ లింక్ ను క్లిక్ చేసి పరీక్ష రాయవచ్చు. ఈ పరీక్ష లో మీకు వచ్చిన మార్కులను బట్టి ఎంపిక చేయబడిన విద్యార్ధుల జాబితా ను వెబ్ సైట్ లో ఉంచడం జరుగుతుంది. అగ్రిసెట్ లాంగ్ టర్మ్ క్లాసులు ఫిబ్రవరి 1, 2021 నుండి ప్రారంభం కానున్నాయి.

ఈ పరీక్ష రాయడానికి ముందుగా ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోనవసరం లేదు. వెబ్ సైట్ లో మాత్రమే పరీక్ష లింక్ ఇవ్వడం జరుగుతుంది. DA, DST మరియు DOF విభాగాలలో   ఆన్ లైన్  పరీక్ష నిర్వహించ బడుతుంది. శిక్షణా కాలం 4 నెలలు.

కేటగిరీ A లో సెలెక్ట్ అయిన వారికి పూర్తి ఉచితం.

కేటగిరీ B లో సెలెక్ట్ అయిన వారికి పూర్తి ట్యూషన్ ఫీజు ఉచితం .( హాస్టల్ మరియు మెస్ చార్జీల క్రింద నెలకు 2500 /-  చొప్పున  కట్టవలసి ఉంటుంది. )

కేటగిరీ C లో సెలెక్ట్ అయిన వారు నెలకు 6500/- చొప్పున కట్టవలసి ఉంటుంది.

ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువమంది మంది విద్యార్ధులకు  షేర్ చెయ్యండి…. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సేవా దృక్పథం తో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది గా విజ్ఞప్తి చేస్తున్నాను…

ఆన్ లైన్ పరీక్ష తేదీ :  జనవరి 24, 2021 ఆదివారం ఉదయం పది గంటలకు

విజయ్ కుమార్ బోమిడి, డైరక్టర్, విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు 8125443163

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *