అగ్రిసెట్ పరీక్ష రాసిన విద్యార్దులకు అందుబాటులో ఉన్న బి ఎస్సీ(అగ్రి) సీట్ల వివరాలు 
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధి లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగం లో అనేక పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి.. ఈ కాలేజీల్లో చదువుతున్న డిప్లొమా విద్యార్దులు బి ఎస్సీ (అగ్రికల్చర్) లోనికి ప్రవేశానికి గాను అగ్రిసెట్ పరీక్షను నిర్వహిస్తోంది….అయితే ఎప్పుడూ ఊహించలేనంతగా బిఎస్సీ ఏజీ కోర్సుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.. కనీసం పది లక్షలైనా కట్టి మేనేజ్ మెంట్ సీట్ అయినా సంపాదించాలని తల్లిదండ్రులు చాలా ఆరాట పడుతున్నారు… ప్రైవేట్ రంగం లో కూడా వ్యవసాయ కళాశాలలు ప్రారంభించడం తో సీట్ల సంఖ్య కూడా బాగా పెరిగింది.. అయితే సీట్ల సంఖ్య పై అగ్రిసెట్ రాసిన విద్యార్దులకు సరైన అవగాహన లేకపోవడం వలన వారు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు… ఈ సందర్బం గా వారికి కొంచం అవగాహన కలిగించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం మరియు గ్రీన్ క్రాస్ ఫౌండేషన్, విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు వారి  ముఖ్య ఉద్దేశ్యం కూడా….

సీట్ల వివరాలు:
అగ్రిసెట్ రాసిన వారికి మూడు కేటగిరీలలో సీట్లు అందుబాటులో ఉన్నాయి.అవి

1. గవర్నమెంట్ వ్యవసాయ కళాశాలలో లభ్యమవుతున్న ఫ్రీ సీట్లు
2. ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలలో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు
3. ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలలో ఉన్న మేనేజ్ మెంట్ కోటా సీట్లు

ఒక్కొక్క కేటగిరీ లోని సీట్ల వివరాల గురించి ఇప్పుడు వివరం గా చూద్దాం..
అగ్రిసెట్ రాసిన వారికి ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధి లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య: 184

1. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలలో ఉన్న ఫ్రీ సీట్లు:
ప్రభుత వ్యవసాయ కళాశాలలలో అగ్రిసెట్ రాసిన వారికి ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 112.   ఈ 112 సీట్లలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వారికి 97, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ వారికి 13 సీట్లు, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ వారికి 2 సీట్లు  అందుబాటులో ఉన్నాయి… అగ్రిసెట్ లో వచ్చిన ర్యాంకు ఆధారం గా ఈ సీట్లను కేటాయిస్తారు.. ఈ సీటు వచ్చిన వారికి ఫీజు కూడా సాధారణం గా ఉంటుంది.. వ్యవసాయ డిప్లొమా వారి 97 సీట్లలో 85 శాతం లోకల్ వారికి, 15 శాతం సీట్లు అన్ రిజర్వడ్ గా  ఉంటాయి.

2. ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలలో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మొత్తం ఆరు (6) ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలలో ఉన్న మొత్తం కన్వీనర్ కోటా సీట్లు సుమారుగా 72. వీటిలో అగ్రికల్చర్ డిప్లొమా వారికి 62, సీడ్ టెక్నాలజీ వారికి 8, ఆర్గానిక్ ఫార్మింగ్ వారికి 2 సీట్లు అందుబాటు లో ఉన్నాయి. అయితే మొత్తం ఉన్న 72 సీట్లలో 65% సీట్లు కన్వీనర్ కోటా క్రింద మిగిలిన 35% సీట్లు మేనేజ్ మెంట్ సీట్ల క్రింద భర్తీ చేస్తారు. ఈ సీట్లను కౌన్సిలింగ్ ద్వారా యూనివర్సిటీ భర్తీ చేస్తుంది…

ఈ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజులు కొంచం ఎక్కువగా ఉంటాయి.. అంటే ఫ్రీ సీట్ల కంటే కొంచం ఫీజు ఎక్కువే ఉంటుంది.. అంచనా గా చెప్పాలంటే మొదటి సెమిస్టర్ లో జాయిన్ అయ్యేటప్పుడు కనీసం ఒక లక్షా ఇరవై వేల రూపాయలు వరకూ కట్టవలసి ఉంటుంది.. రెండవ సెమిస్టర్ లో ఎనభై వేల వరకూ కట్టవలసి ఉంటుంది… అంటే సంవత్సరానికి సుమారుగా రెండు లక్షలు (ప్రతి నెలా మెస్ ఖర్చులు కనీసం 3 వేలు చొప్పున అదనం)కట్టవలసి ఉంటుంది… (ఇది కేవలం అంచనా గా చెప్తున్న వివరాలు మాత్రమే.. కౌన్సిలింగ్ కి రమ్మని చెప్పే నోటిఫికేషన్ లో ఫీజుల పూర్తి వివరాలు ప్రకటిస్తారు). ఫీజు రీ ఇంబర్స్ మెంట్ వర్తిస్తుంది… అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. సంవత్సరానికి సగానికి పైగా మొత్తం ఇలా వెనక్కి తిరిగి వస్తుంది కాబట్టి కొద్దిగా డబ్బు పెట్టగలిగే వారు ఈ కన్వీనర్ కోటా సీట్లను అసలు వదులుకోవద్దు..

3. ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలలో ఉన్న మేనేజ్ మెంట్ సీట్లు:
ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలలో మేనేజ్ మెంట్ సీట్లు ఉంటాయి. ఈ సీట్ల కోసం ప్రైవేట్ కాలేజీల వారిని సంప్రదించి జాయిన్ కావచ్చు… అయితే చెల్లించవలసిన మొత్తం ఎక్కువ ఉంటుంది… కనీసం 15 లక్షల వరకూ ఉండవచ్చు… ఆయా కాలేజీల వారితో మాట్లాడుకొని అంత మొత్తం చెల్లించ డానికి సిద్దపడిన వారు మేనేజ్ మెంట్ సీటు కోసం ప్రయత్నించవచ్చు….

ఈ సంవత్సరం (2020) వెబ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది.. దానికి సంబంధించిన వివరాలు మరొక వ్యాసం లో తెలియజేస్తాను…

– మీ విజయ్ కుమార్ బోమిడి,
డైరక్టర్,
విజయ్ కుమార్ అగ్రి అకాడమీ ,
సాలూరు, విజయనగరం జిల్లా
(8125443163)