తెలుగు రాష్ట్రాలలో ఏ వ్యవసాయ కళాశాలలకు ఐ.సి.ఏ.ఆర్ గుర్తింపు ఉంది…. ఏ కళాశాలలకు గుర్తింపు లేదు అనే అంశాలపై విద్యార్దులకు సరైన అవగాహన ఉండటం లేదు…. ఐ.సి.ఏ.ఆర్ గుర్తింపు అసలు ఉండాలా లేకపోయినా పర్వాలేదా అనే విషయాల పై కూడా సరైన అవగాహన ఉండటం లేదు….. అందుచేత గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ ఈ విషయాలపై పూర్తి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తోంది… ముందుగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలలో ఉన్న వ్యవసాయ కళాశాలల గురించి, వాటికి ఐ.సి.ఏ.ఆర్ గుర్తింపు ఉన్నదా లేదా అనే అంశాలను పరిశీలిద్దాం…..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఐ.సి.ఏ.ఆర్ గుర్తింపు పొందిన కళాశాలల వివరాలు:
గవర్నమెంట్ వ్యవసాయ కళాశాలలు:

1. వ్యవసాయ కళాశాల, బాపట్ల, గుంటూరు జిల్లా
2. వ్యవసాయ కళాశాల, నైరా, శ్రీకాకుళం జిల్లా
3. వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరము, తూర్పు గోదావరి జిల్లా
4. ఎస్. వీ వ్యవసాయ కళాశాల, తిరుపతి, చిత్తూరు జిల్లా
5. వ్యవసాయ కళాశాల, మహానంది, కర్నూలు జిల్లా

ఐ.సి.ఏ.ఆర్ గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు:
1. జే.సి.దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాల, తాడిపత్రి, అనంత పురము జిల్లా
2. కదిరి బాబూరావ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, సి.ఎస్.పురం, ప్రకాశం జిల్లా
3. ఎన్.ఎస్. వ్యవసాయ కళాశాల, మార్కాపూర్, ప్రకాశం జిల్లా
4. శ్రీ కృష్ణ దేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, అనంత పురము, అనంత పురము జిల్లా
5. శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా
6. ఎస్.బి.వి.ఆర్ వ్యవసాయ కళాశాల, బద్వేల్, కడప జిల్లా

పై కళాశాలలు అన్నీ ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి అఫిలియేట్ కళాశాలలు కాబట్టి వాటికి కూడా ఐకార్ గుర్తింపు ఉంటుంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వీరు అర్హులు గా ఉంటారు.

తెలంగాణా రాష్ట్రం లో ఐ.సి.ఏ.ఆర్ గుర్తింపు పొందిన వ్యవసాయ కళాశాలలు:
1. వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, రంగారెడ్డి జిల్లా
2. వ్యవసాయ కళాశాల, ఆశ్వారావ్ పేట, ఖమ్మం జిల్లా
3. వ్యవసాయ కళాశాల, జగిత్యాల, కరీంనగర్ జిల్లా
4. వ్యవసాయ కళాశాల, పాలెం, మహబూబ్ నగర్ జిల్లా

తెలంగాణా రాష్ట్రం లో ICAR గుర్తింపు పొందిన ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలు లేవు.
విద్యార్దులు ఐ.సి.ఏ.ఆర్ గుర్తింపు ఉన్న కళాశాలల వివరాలు తెలుసుకొని ఆయా కళాశాలలలో  చేరగలరని ఆశిస్తున్నాను…

విజయ్ కుమార్ బోమిడి, డైరక్టర్ 
విజయ్ కుమార్ అగ్రి అకాడమీ,
సాలూరు, విజయనగరం జిల్లా (8125443163)